మునిసిపల్ సమ్మె మరింత ఉధృతం
చీపురు మూలపడింది.. పారిశుధ్యం పడకేసింది..రోడ్డెక్కిన కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని పట్టుపట్టారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య సం ఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నాలుగో రోజూ కొనసాగింది. గురువారం జరిగిన సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐక్య సంఘాలు పలు నిరసన కార్యక్రమాలు నిర్వ హించారు. వివిధ జిల్లాలలోని ప్రధాన కూడళ్ల వద్ద కార్మికులు, ఉద్యోగులు రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వం ఇది వరకే కార్మిక సంఘాలతో మూడు సార్లు జరిపిన చర్చ లు విఫలమయ్యాయి. గురువారం సాయంత్రం వరకు కూడా ప్రభు త్వం నుంచి చర్చలకు ఆహ్వానం అందలేదు. దీంతో కార్మిక సంఘాలు సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ నెల 11న మహాధర్నా చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఈ ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లా ఐక్య సంఘాలు తమ దూకుడును మరింత పెంచనున్నాయి. గ్రేట ర్ హైదరాబాద్‌లో కార్మికులు మరో అడుగు ముందుకేశారు. ఏకంగా నీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం నీటి సరఫరా నిలిచిపోయింది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్, నిజామాబాద్,కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. చెత్త సేకరించే వాహనాలు బయటకు రాలే దు. వివిధ ప్రాంతాల్లో రోడ్డుపైనే చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లింది. సమ్మె మూడోరోజుకు చేరుకున్నా ప్రభుత్వం నుంచి స్పం దన లేకపోవడం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హరిత హారం కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటనలో ఉన్నందున, వేత నాల పెంపు విషయంలో నిర్ణయం తీసుకోలేమని చెప్పిన మంత్రులు, ఇప్పడు సిఎం అందుబాటులో ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నా రని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








